Amaravati: రాజధాని రగడ: గుంటూరు జిల్లాలో స్వచ్ఛంద బంద్!

  • విద్యార్థి, యువజన జేఏసీల పిలుపు 
  • సెలవు ప్రకటించిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు 
  • బంద్ కు అనుమతి లేదన్న గుంటూరు అర్బన్ ఎస్పీ

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థి, యువజన జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో స్వచ్ఛందంగా బంద్ జరుగుతోంది. కృష్ణా జిల్లాలో నిన్న కొనసాగిన బంద్ ఈ రోజు గుంటూరుకు విస్తరించింది. గుంటూరులోని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆందోళనకారులు బస్టాండ్ వద్ద ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడుదామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాల తర్వాత తమకు మరింత ధైర్యం వచ్చిందని, పట్టుదల పెరిగిందని తెలిపారు.

కీలక సమయంలో పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తీరును రైతులు తప్పుపట్టారు. మరోవైపు బంద్ కు ఎటువంటి అనుమతులు లేవని గుంటూరు అర్బన్ ఎస్పీ స్పష్టం చేశారు. బస్సులను అడ్డుకోవడం, పాఠశాలలు, షాపులు మూయించడం చట్టవ్యతిరేకమవుతుందని తెలిపారు.

More Telugu News