Prabhas: 'జాన్' కోసం వేసిన సెట్ ఖర్చు 3 కోట్లు

  • షూటింగు దశలో 'జాన్'
  • భారీస్థాయిలో వేసిన ప్రత్యేకమైన సెట్ 
  •  తదుపరి షెడ్యూల్ ఆస్ట్రియాలో

ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. 'బాహుబలి' నుంచి ఆయన సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తోనే రూపొందుతున్నాయి. అదే జాబితాలోకి తాజాగా 'జాన్' కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. యూరప్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కొంతకాలం క్రితం యూరప్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇప్పుడు అదే నేపథ్యంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించడానికి భారీ సెట్ వేశారు. అంటే .. కథ సెట్లో కాకుండా యూరప్ లో నడుస్తున్నట్టుగానే ఉంటుందన్న మాట. ఆ ఫీల్ ను తీసుకురావడానికి ఆ స్థాయిలో వేసిన కారణంగానే ఈ సెట్ కోసం 3 కోట్ల వరకూ ఖర్చు అయిందట. ప్రత్యేకమైన ఈ సెట్లో షూటింగ్ పూర్తయిన తరువాత, తదుపరి షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News