Karnataka: మహిళా అధికారిపై గ్రామ పంచాయితీ మెంబర్, విలేకరిల వేధింపులు... విషం తాగిన యువతి!

  • కర్ణాటకలోని భారతీనగర్ లో ఘటన
  • వేధింపులను ఆపలేకపోయిన తల్లి
  • కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం

ఓ పత్రిక విలేకరి, గ్రామ పంచాయితీ సభ్యుడి లైంగిక వేధింపులను భరించలేకపోతున్నానంటూ, యువ అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది`. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని భారతీనగర్‌ లో గ్రామ పంచాయితీ అధికారిణిగా అనితా రాజేశ్వరి అనే యువతి పనిచేస్తోంది.

గడచిన ఏడాదిగా, ఓ వారపత్రిక విలేకరి, మరో సహోద్యోగి ఆమెను వేధిస్తున్నారు. అదే ప్రాంతంలోని రూరల్ పోలీసు స్టేషన్ లో అనితా రాజేశ్వరి తల్లి ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తుండగా, విషయం ఆమెతో చెప్పింది. ఆమె వారిని పిలిపించి, వేధింపులు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించినా వారి వైఖరి మారలేదు.

 దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనితా రాజేశ్వరి మంగళవారం నాడు తన కార్యాలయంలోనే విషం తాగింది. విషయాన్ని గుర్తించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసును రిజిస్టర్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News