Raviteja: రవితేజ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన 'డిస్కోరాజా'

  • సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'డిస్కోరాజా'
  • వీఐ ఆనంద్ చేసిన మరో ప్రయోగం
  • ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం

రవితేజ ఎన్నో విభిన్నమైన కథల్లో విలక్షణమైన పాత్రలను పోషించాడు. పెద్ద దర్శకులతో చేసినా, ఒక స్థాయి బడ్జెట్ లోనే వాటిని పూర్తి చేశాడు. అయితే ఈ సారి కథా పరంగాను .. బడ్జెట్ పరంగాను ఆయన తాజా చిత్రం 'డిస్కోరాజా' ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సారి ఆయన తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కి సైన్స్ ను యాడ్ చేసుకున్నాడు.

అలాగే ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇదే. ఈ సినిమా కోసం 34 కోట్ల వరకూ ఖర్చు చేశారు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అంతకుమించిన వసూళ్లను రాబట్టవలసి వుంటుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేయడం మరో విశేషం. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

More Telugu News