Tirumala: తిరుమలలో కనిపించని రద్దీ... దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలోనే భక్తులు!

  • దర్శనానికి 2 గంటల సమయం
  • ఇతర భక్తులకూ అదే సమయంలో దర్శనం
  • నిన్న దర్శించుకున్న 70,712 మంది భక్తులు

తిరుమలలో రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 2 కాంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తుండగా, వీరికి రెండు గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తి చేయిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 70, 712 మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా సుమారు రూ. 3 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. వారాంతం వరకూ రద్దీ తక్కువగానే ఉంటుందని భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నామని తెలిపారు.

More Telugu News