Jagan: జగన్ ఆశించినంత సులభం కాదు: జేసీ

  • మూడు రాజధానుల వల్ల  ప్రయోజనం ఉండదు
  • శాసనసభ తీర్పును అందరూ గౌరవించాల్సిందే
  • కేంద్రానికి మాత్రం అమరావతే అని చెబుతాడు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశించినంత సులభంగా మూడు రాజధానుల ఏర్పాటు జరగదని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్న రాష్ట్రమైన ఏపీలో మూడు రాజధానుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని జేసీ పెదవి విరిచారు. అయితే, శాసనసభ తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.

కృష్ణా నది ఎగువన చాలా ప్రాజెక్టులు నిర్మించారు కాబట్టి అమరావతికి ఎటువంటి వరద ముప్పు ఉండదన్నారు. ఏపీ రాజధాని అమరావతేనంటూ కేంద్రానికి జగన్ నివేదికలు పంపుతాడని, అయితే, బ్రెయిన్ మాత్రం విశాఖలో పెడతాడని జేసీ అన్నారు. రాజధాని తలకాయ అయితే, బ్రెయిన్ సెక్రటేరియట్ అని, అది లేకుండా ఏం ఉపయోగమని జేసీ ప్రశ్నించారు.

More Telugu News