CPM: ‘నౌకరీ పే చర్చ’ చేపట్టి నిరుద్యోగుల ‘మన్ కీ బాత్ వినాలి’: సీపీఎం నేత సీతారాం ఏచూరి

  • ప్రధాని ‘పరీక్షా పే చర్చ‘ కార్యక్రమం పై ఏచూరి విమర్శలు
  • నోట్ల రద్దు, ప్రణాళిక లేని జీఎస్టీతో నిరుద్యోగం పెరిగింది
  • దేశ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగిత నెలకొంది

ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’ పేర విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంపై సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శలు చేశారు. ప్రధాని పరీక్షల గురించి విద్యార్థులతో చర్చించడం ఆపి, దేశంలోని నిరుద్యోగులతో చర్చలు ప్రారంభించాలని సూచించారు. వారి మనసులోని మాటను కూడా వినాలన్నారు. మన్ కీ బాత్, పరీక్షా పే చర్చ వంటి కార్యక్రమాల్లో మోదీ మాట్లాడుతూ.. నిరుద్యోగులను మరిచినట్లున్నారని వ్యాఖ్యానించారు.

ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మోదీ ‘నౌకరీ పే చర్చ’ అనే కార్యక్రమం చేపట్టి నిరుద్యోగుల ‘మన్ కీ బాత్’ కూడా వినాలని పేర్కొన్నారు. నోట్ల రద్దు, ప్రణాళిక లేని జీఎస్టీ అమలుతో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఇంత స్థాయిలో నిరుద్యోగితను తానెప్పుడూ దేశంలో చూడలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిరుద్యోగిత స్థాయి 44 శాతానికి చేరుకుందని చెప్పారు.

More Telugu News