Telangana: రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

  • 9 నగరపాలక సంస్థలు,120 మున్సిపాలిటీలకు ఎన్నిక
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ మినహా 9 నగరపాలక సంస్థలు,120 మున్సిపాలిటీలలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధుల్లో 44 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 120 మున్సిపాలిటీల్లో 6325, 9 కార్పొరేషన్లలో 1586 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 53 లక్షల 36 వేల 605 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 26 లక్షల 71 వేల 694 మంది పురుషులు కాగా, 26 లక్షల 64 వేల 557 మంది మహిళలు, ఇతరులు 354 మంది ఉన్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6 లక్షల 40 వేల మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39 వేల 720 మంది ఓటర్లు ఉన్నారు.

More Telugu News