Nepal: నేపాల్ హోటల్లో ఎనిమిది మంది భారతీయుల మృతి

  • హీటర్ కారణంగా.. ఊపరి అందక చనిపోయారని ప్రకటన
  • మృతుల్లో రెండు జంటలు.. నలుగురు పిల్లలు
  • విచారణ జరుపుతోన్న పోలీసులు

నేపాల్ పర్యటనకు వెళ్లిన ఆ భారతీయులు మృత్యువు ఒడికి చేరారు. చలి నుంచి రక్షణ కోసం హోటల్లో అమర్చిన గ్యాస్ హీటర్ లో లోపం వల్ల గ్యాస్ విడుదలై, ప్రాణ వాయువు అందకపోవడంవల్లే వారు మృతి చెందారని తెలుస్తోంది. వీరిలో రెండు జంటలు, నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేరళకు చెందిన ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు నేపాల్ సందర్శనకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో నిన్న రాత్రి డామన్ లోని ఎవరెస్ట్ పనోరమా రిసార్ట్ లో నాలుగు గదులు బుక్ చేసుకుని అందులో విశ్రమించారు.  

ఈ రోజు ఉదయం గదుల్లోని వారు బయటకు రాకపోవడంతో హోటల్ సర్వీస్ సిబ్బంది, రిసార్ట్ యజమానికి తెలిపారు. యజమాని ఆదేశాలతో తలుపులు పగులగొట్టి చూడటంతో.. లోపల ఉన్నవారు మరణించి ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రవీణ్ కుమార్ యాదవ్(39), శరణ్య (34), రంజిత్ కుమార్(39), ఇందు రిజిత్ (34), శ్రీ భద్ర(9), అబినబ్ సోరయ(9), అభినాయర్(7), భైష్ణబ్ రంజిత్(2) ఉన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

More Telugu News