ap7am logo

అమితాబ్ నటించిన ‘జుంద్’ చిత్రం టీజర్ విడుదల

Tue, Jan 21, 2020, 04:07 PM
  • విజయ్ బర్సే నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం
  • నాగరాజ్ మంజులే దర్శకత్వంలో వస్తోన్న సినిమా
  • మే నెల 8న ప్రేక్షకుల ముందుకు..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  నటిస్తోన్న ‘జుంద్’ చిత్రం టీజర్  విడుదలైంది. టీజర్లో పిల్లలు బ్యాట్లను పట్టుకుని ముందుకు వెళుతున్న సీన్ ఉంది. ఈ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ కోచ్ విజయ్ బర్సే నిజ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు.

బర్సే నాగపూర్ లో స్లమ్ సాకర్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి మురికివాడల్లో నివసించే పిల్లలకు ఫుట్ బాల్ క్రీడలో మెళుకువలను నేర్పించారు. అదే కథాంశంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా  చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్న నాగరాజ్ మంజులే తెలిపారు. మరాఠీ చిత్ర దర్శకుడైన మంజులే ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం ఇదే ప్రథమం. పిల్లలను ఫుట్ బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే క్రమంలో బర్సేకు ఎదురైన ఆటంకాలను అధిగమించిన తీరును వెండితెరపై ప్రేక్షకులు చూడనున్నారు. అమితాబ్ ప్రధాన పోషిస్తున్న ఈ చిత్రం మే 8న విడుదల కానుంది
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad