Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 205 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 54 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... ట్రేడింగ్ చివరి వరకు కోలుకోలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 205 పాయింట్లు నష్టపోయి 41,323కు పడిపోయింది. నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 12,169కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (0.50%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.48%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.46%), ఓఎన్జీసీ (0.25%), టీసీఎస్ (0.20%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.01%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.42%), మారుతి సుజుకి (-2.10%), ఏసియన్ పెయింట్స్ (-2.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.95%).

More Telugu News