కేరళ పర్యటనలో తెలంగాణ ఉన్నతాధికారుల బృందం

21-01-2020 Tue 14:58
  • సమగ్ర ఎన్నారై విధానం రూపొందించే యోచనలో టీ-ప్రభుత్వం
  • సీఎం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల విధానాలపై అధ్యయనం
  • ఇందులో భాగంగా కేరళలో పర్యటిస్తున్న బృందం

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి వివిధ రాష్ట్రాల విధానాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తోంది. విదేశాలకు వెళ్లే కేరళ ప్రజలకు ఆ రాష్ట్రం అమలు చేస్తున్న విధానంపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. తెలంగాణ ఉన్నతాధికారుల బృందంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు  ఉన్నారు. తిరువనంతపురంలో ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహారాల శాఖ అధికారులతో వారు సమావేశమయ్యారు.