India: మీడియా సంస్థలు బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ తో బాధపడుతున్నాయి: రాష్ట్రపతి కోవింద్

  • దేశంలో జర్నలిజం ప్రమాణాలపై రాష్ట్రపతి ఆందోళన
  • ఫేక్ న్యూస్ సంస్కృతి పెరిగిపోయిందని వ్యాఖ్యలు
  • పాత్రికేయ వృత్తికి మాయని మచ్చ అంటూ ఆవేదన

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశంలో మీడియా సంస్థల తీరుతెన్నులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక మీడియా సంస్థలు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాయని విమర్శించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవాళ్లు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల కారణంగా పాత్రికేయ వృత్తికి తీరని కళంకం అని అభిప్రాయపడ్డారు. ఫేక్ న్యూస్ సంస్కృతి కారణంగా పాత్రికేయ రంగానికి చెందిన అత్యున్నత ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ అంశం నేడు సమాజంలో అతిపెద్ద రుగ్మతగా మారిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్వహించిన రామ్ నాథ్ గోయెంకా ఎక్స్ లెన్సీ ఇన్ జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News