Jagan: ఈ నినాదాలు మూడు గంటల నుంచి చూస్తున్నాను అధ్యక్షా: అసెంబ్లీలో జగన్ ఆగ్రహం

  • అసెంబ్లీలో టీడీపీ నేతలు స్పీకర్ పోడియం దగ్గరకు వస్తున్నారు
  • అమరావతికి జై అంటూ నినాదాలు చేస్తున్నారు 
  • అమరావతి జై అని ఎందుకు అంటున్నారో వారికే తెలియదు
  • ఏదైనా మాట్లాడడం మొదలు పెడితే చాలు టీడీపీ నేతలు అరుస్తున్నారు

టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'దాదాపుగా మూడు గంటల నుంచి చూస్తున్నాను అధ్యక్షా. అసెంబ్లీలో టీడీపీ నేతలు స్పీకర్ పోడియం దగ్గరకు రావడం, అమరావతికి జై అంటూ వారు నినాదాలు చేయడం చూస్తున్నాను. ఎందుకు అమరావతి జై అంటున్నారో వారికే తెలియదు' అని అన్నారు.

'ఒక వైపు ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక కమిషన్‌లు ఏర్పాటు చేయడానికి చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెడుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇటువంటి హీనమైన చరిత్ర ఈ దిక్కుమాలిన టీడీపీకి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, చంద్రబాబుకి ఉంది. ఒకవైపు ఆ బిల్లు కౌన్సిల్‌లో ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు. మరోవైపు మళ్లీ అటువంటి దిక్కుమాలిన ఆలోచనలతో ఇక్కడకు వస్తున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.

'సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడడం మొదలు పెడితే చాలు టీడీపీ నేతలు అరుస్తున్నారు. చర్చను జరగనివ్వకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ బిల్లును టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఎస్సీలకు చంద్రబాబు న్యాయం చేయలేదు. మేము న్యాయం చేస్తున్నాము' అని జగన్ అన్నారు.

More Telugu News