ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా!

21-01-2020 Tue 12:15
  • సభ్యులంతా రావాలని టీడీపీ విప్
  • నేటి సభకు డొక్కా గైర్హాజరు
  • మరికొందరు ఎమ్మెల్సీలు గైర్హాజరు
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, తన పదవికి రాజీనామా చేశారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న తెలుగుదేశం పార్టీ, మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసిన వేళ, నేటి సభకు డొక్కా గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నానని, పేర్కొంటూ లేఖను పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పంపించారు.

ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పాల్గొనబోనని తన లేఖలో డొక్కా పేర్కొన్నారు. డొక్కా వైఖరిపై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా, నేటి సభకు టీడీపీ మరో ఎమ్మెల్సీ శమంతకమణి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నబాయి తదితరులు గైర్హాజరయ్యారు. ఇక డొక్కా, టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా? అన్న విషయమై స్పష్టత లేదు. డొక్కా రాజీనామాపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.