Ajay Devagan: 'ఆర్ఆర్ఆర్' అప్ డేట్... అజయ్ దేవగణ్ వచ్చి కలిశాడు!

  • రాజమౌళి దర్శకత్వంలో చిత్రం
  • కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ 
  • నేటి నుంచి షూటింగ్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా షూటింగ్ లో చేరాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాజమౌళిని కలిసిన అజయ్ దేవగణ్ నేటి నుంచి షూటింగ్ లో భాగం కానున్నాడు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News