నా సినిమాల్లో రాజేంద్రప్రసాద్ గారు ఉండటానికి కారణం అదే: దర్శకుడు అనిల్ రావిపూడి

21-01-2020 Tue 10:25
  • రాజేంద్రప్రసాద్ గారంటే అభిమానం 
  • ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని 
  • ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్న అనిల్ రావిపూడి
దర్శకుడిగా అనిల్ రావిపూడి వరుసగా 5 హిట్లు ఇచ్చాడు. ఒక్క 'పటాస్' సినిమాలో మినహా ఆయన దర్శకత్వం వహించిన మిగతా నాలుగు సినిమాల్లోనూ రాజేంద్రప్రసాద్ వున్నారు. వరుసగా రాజేంద్ర ప్రసాద్ ను తీసుకోవడానికి గల కారణాన్ని ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించాడు.

"మొదటి నుంచి కూడా నేను రాజేంద్రపరసాద్ గారికి వీరాభిమానిని. ఆయన సినిమాలను వదలకుండా చూసేవాడిని. ఆయన ఎక్కడ కనిపించినా ఆయన పట్ల గల అభిమానాన్ని చాటుకోవాలని అనుకునేవాడిని. నేను దర్శకుడిని అయిన తరువాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం .. అదృష్టం లభించింది. ఆయన నటన పట్ల నాకు గల ఇష్టమే .. ఆయన పట్ల గల అభిమానమే నా సినిమాల్లో ఆయనకి అవకాశం ఇవ్వడానికి ప్రధాన కారణమని చెప్పాలి" అన్నాడు.