అజిత్ కి జోడీగా ఆమెకే ఛాన్స్ ఎక్కువ!

21-01-2020 Tue 09:56
  • అజిత్ తాజా చిత్రంగా రూపొందుతున్న 'వాలిమై'
  • పరిశీలనలో నలుగురు కథానాయికల పేర్లు
  • హ్యూమా ఖురేషి ఎంపికయ్యే ఛాన్స్
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస విజయాలతో ఆయన క్రేజ్ పెరుగుతూపోతోంది. ప్రస్తుతం ఆయన 'వాలిమై' అనే సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు నెలలుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంతవరకూ ఈ సినిమాకిగాను కథానాయికను ఎంపిక చేయలేదు.

తదుపరి షెడ్యూల్లో కథానాయిక కాంబినేషన్ సీన్స్ ఉండటంతో, ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అనే దిశగా దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. వాళ్లు అనుకున్న జాబితాలో కీర్తి సురేశ్ .. ఇలియానా .. హ్యూమా ఖురేషి .. యామీ గౌతమ్ పేర్లు వున్నాయట. అయితే పాత్ర పరంగా చూసుకుంటే, హ్యూమా ఖురేషి అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు మొదలు పెట్టనున్నారట. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారు కావొచ్చని అంటున్నారు.