Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుష్క సినిమా విడుదల వాయిదా? 
  • 'ఆర్ఆర్ఆర్' కోసం అజయ్ దేవగణ్ 
  • మహేశ్ సినిమాకి తమన్ మ్యూజిక్  

 *  అందాలతార అనుష్క కథానాయికగా నటించిన 'నిశ్శబ్దం' చిత్రం విడుదల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 31న ఇది విడుదల కావలసి వుంది. అయితే, ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో విడుదల వాయిదా పడ్డట్టుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావల్సివుంది.
*  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగులో ఆయన రేపటి నుంచి పాల్గొంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం పాల్గొనే క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
*  తాజాగా 'అల వైకుంఠపురములో' చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ ను ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్ డిమాండ్ ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించే తాజా చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకున్నట్టు సమాచారం.  

More Telugu News