Hyderabad: నువ్వసలు ఇంటికి వెళ్లవా... అన్నీ ఎయిర్ పోర్టులోనేనా..?: ఫొటోగ్రాఫర్ తో ఎన్టీఆర్ చమత్కారం

  • ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
  • ఓ యాడ్ ఫిలిం కోసం ముంబయి వెళ్లి తిరిగొచ్చిన జూనియర్
  • ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్ ను గుర్తుపట్టి ఛలోక్తులు

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ రావడంతో ఓ యాడ్ లో నటించేందుకు ముంబయి వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ ను గుర్తుపట్టి దగ్గరికి పిలిచి ఛలోక్తులు విసిరాడు. "నువ్వసలు ఇంటికే వెళ్లవా... ఎయిర్ పోర్టులోనే ఉంటావా? తిండీ, స్నానం అన్నీ ఇక్కడేనా..?" అంటూ తనదైన శైలిలో వేళాకోళమాడాడు. గతంలో ఇదే విమానాశ్రయంలో ఎన్టీఆర్ ఫొటోలు తీసిన ఆ ఫొటోగ్రాఫర్ తనను ఎన్టీఆర్ గుర్తుపట్టడంతో సంతోషం పట్టలేకపోయాడు. అందుకే ఎన్టీఆర్ తనపై సెటైర్ వేసినా నవ్వుతూ స్వీకరించాడు.

More Telugu News