World Famous Lover: 'వరల్డ్ ఫేమస్ లవర్' మొదటి పాట రిలీజ్... స్పందించిన విజయ్ దేవరకొండ

  • 'మనసును మీటే' అంటూ సాగే హృద్యమైన గీతం
  • గోపీసుందర్ బాణీలు, రహ్మాన్ సాహిత్యం
  • ఈ పాట ఓ అందమైన భావన అని పేర్కొన్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి మొదటి పాట రిలీజైంది. 'మై లవ్... మనసును మీటే' అంటూ సాగే ఈ మెలొడీని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ పాటకు రహ్మాన్ సాహిత్యం సమకూర్చారు. శ్రీకృష్ణ, రమ్య బెహరా గాత్రంలో అందంగా జాలువారిన ఈ పాట గురించి విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో స్పందించారు.

'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలోని తొలిపాట ఓ అందమైన భావన అని పేర్కొన్నారు. ఈ పాట తనను అన్ని మధుర క్షణాల గురించి ఆలోచించేలా చేసిందని వివరించారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News