Telugudesam: అమరావతి, విశాఖలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: టీడీపీ నేత రామానాయుడు డిమాండ్

  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అబద్ధం
  • వైసీపీ నేతలు విశాఖలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ చేశారు
  • విచారణకు మేము సహకరిస్తాం 

టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు.

అమరావతిలో, విశాఖలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణకు తాము సహకరిస్తామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ కు సూచించారు. రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీని నిర్మాణానికి ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని అన్నారు. అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ఎన్నోఅసత్యాలు ప్రచారం చేసిందని ఆరోపించారు.

More Telugu News