Virat Kohli: నేను బాదుతా... నువ్వు నిలబడు.. కోహ్లీకి స్పష్టంగా చెప్పిన రోహిత్ శర్మ!

  • నిన్న బెంగళూరులో ఆసీస్ తో మూడో వన్డే
  • 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్
  • కోహ్లీ, రోహిత్ భాగస్వామ్యంలో 137 పరుగులు

నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక క్రికెట్ పోరులో ఆస్ట్రేలియా జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు సీరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న వేళ, తొలి వికెట్ రూపంలో కేఎస్ రాహుల్ అవుటైన తరువాత మైదానంలో జరిగిన ఘటనను రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.

కోహ్లీ రాగానే, సాధ్యమైనంత భారీ స్కోరు చేయాలని, క్రీజును వీడరాదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. భారీ భాగస్వామ్యం కావాలంటే, కోహ్లీ వంటి సహచరుడు ఉండాలని, అందువల్లే 100కు పైగా పరుగులను స్కోర్ బోర్డుకు జోడించగలిగామని అన్నాడు. తాను రిస్క్ చేస్తానని, ఎఫెన్స్ ఆడుతానని, కోహ్లీని మాత్రం డిఫెన్స్ చేయాలని చెప్పానని, ఆపై తాను రిస్క్ తీసుకుని కొన్ని షాట్లను ఆడానని తెలిపాడు. ఆస్ట్రేలియాలో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని, వారి నుంచి తమకు ప్రతిఘటన ఎదురైనా, అధిగమించామని తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ జోడీ 137 పరుగులను జోడించిన సంగతి తెలిసిందే.

More Telugu News