బాలకృష్ణను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

19-01-2020 Sun 21:46
  • సరికొత్త లుక్స్ లో బాలయ్య
  • గుండు చేయించుకుని వైట్ డ్రెస్సులో చిరునవ్వులు చిందిస్తున్న నందమూరి హీరో
  • మంగళగిరి వచ్చిన బాలకృష్ణ!
ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో ప్రస్థానం కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ తాజా లుక్ ఆసక్తి కలిగిస్తోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఉన్న బాలయ్య గుండు చేయించుకుని ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ పొలిటికల్ లుక్ తో కనిపిస్తున్న ఈ నందమూరి హీరో ఫొటోకు అభిమానులు భారీగా లైకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. బాలయ్య ఏదైనా మొక్కు తీర్చుకున్నారా, లేక సినిమా కోసం గెటప్ మార్చారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తమ్మీద ఈ విధంగా బాలకృష్ణను ఎన్నడూ చూడని అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. కాగా, బాలకృష్ణ మంగళగిరిలో టీడీఎల్పీ సమావేశానికి వచ్చినప్పుడు కెమెరాలు క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది.