India: బెంగళూరు వన్డే: స్మిత్ సెంచరీ, టీమిండియా టార్గెట్ 287 రన్స్

  • భారత్, ఆసీస్ మధ్య మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు
  • 131 పరుగులు చేసిన స్మిత్

బెంగళూరు వన్డేలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131) సెంచరీతో రాణించాడు. భారత్ తో చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (3), ఆరోన్ ఫించ్ (19) విఫలమైనా, స్మిత్, లబుషానే (54) జోడీ పట్టుదలగా ఆడడంతో ఆసీస్ కుదురుకుంది. సెంచరీ పూర్తయిన తర్వాత దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్మిత్ అవుట్ కావడంతో ఆసీస్ స్కోరు నిదానించింది. మొత్తమ్మీద 50 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో ఆసీస్ ను కట్టడి చేయగా, జడేజా 2 వికెట్లు తీశాడు.

More Telugu News