India: బెంగళూరు వన్డేలో ప్రయోగం చేసి తుస్సుమన్న ఆస్ట్రేలియా!

  • స్టార్క్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు దింపిన ఆసీస్
  • సున్నా పరుగులకే వెనుదిరిగిన స్టార్క్
  • ఆసీస్ స్కోరు 35 ఓవర్లలో 4 వికెట్లకు 183 రన్స్

టీమిండియాతో బెంగళూరులో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. 46 పరుగులకే ఓపెనర్లు వెనుదిరిగినా స్మిత్, లబుషాన్ జోడీ మరోసారి సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకుంది. అర్ధసెంచరీ సాధించిన అనంతరం లబుషాన్ అవుటవడంతో ఆస్ట్రేలియా జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ ను బ్యాటింగ్ కు పంపింది. టర్నర్, అగర్ వంటి ఆటగాళ్లు లైనప్ లో ఉన్నా వాళ్లకంటే ముందు స్టార్క్ ను పంపారు.

స్టార్క్ తో పించ్ హిట్టింగ్ చేయించాలన్నది ఆసీస్ శిబిరం ప్లాన్. కానీ స్టార్క్ డకౌట్ కావడంతో ఆసీస్ ఎత్తుగడ విఫలమైంది. మూడు బంతులు ఆడిన స్టార్క్ స్పిన్నర్ జడేజా బౌలింగ్ లో చాహల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆసీస్ పాచిక పారలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (80 బ్యాటింగ్), వికెట్ కీపర్ కేరీ (6 బ్యాటింగ్) ఆడుతున్నారు.

More Telugu News