shirdi: శిరిడీ సాయిబాబా జన్మస్థల వివాదంపై ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • పథ్రీకి ప్రాధాన్యత లభిస్తే, శిరిడీ క్షేత్ర ప్రాధాన్యత తగ్గుతుంది
  • ఇందుకే శిరిడీ వాసులు భయపడుతున్నారు
  • 1950 నుంచి బాబా పథ్రీలోనే ఉన్నారనడానికి ఆధారాలున్నాయి

శిరిడీ సాయిబాబా జన్మ స్థలమని పేరున్న మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలోని పథ్రీని అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ స్పందించారు. సాయిబాబా జన్మస్థలం పథ్రీనేనని చెప్పడానికి తమ దగ్గర 29 సాక్ష్యాలున్నాయన్నారు.

ఒకవేళ పథ్రీ అభివృద్ధి చెంది దానికి ప్రాధాన్యత లభిస్తే, శిరిడీ క్షేత్ర పాధాన్యత తగ్గుతుందని శిరిడీ వాసులు భయపడుతున్నారని ఆయన అన్నారు. 1950 నుంచి బాబా పథ్రీలోనే ఉన్నారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని దుర్రాని అబ్దుల్లా ఖాన్ తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో పథ్రీ అభివృద్ధి కోసం అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రూ.100 కోట్లు అడిగారని ఆయన చెప్పారు.  

దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి ఇప్పటికీ  భక్తులు పథ్రీలోని సాయిబాబా మందిరాన్ని సందర్శిస్తుంటారని అబ్దుల్లా ఖాన్ చెప్పారు. ఈ వివాదాన్ని శిరిడీవాసులు చాలా కాలం నుంచి బయటకు రానివ్వకుండా చూస్తున్నారని చెప్పారు.

More Telugu News