sammakka saralamma: సమ్మక్క- సారలమ్మల దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

  • జనజాతరను తలపిస్తున్న మేడారం 
  • మొక్కులు చెల్లించుకునేందుకు క్యూ 
  • ఫిబ్రవరి ఐదు నుంచి జాతర

తెలంగాణ ప్రజలు నమ్మకంగా కొలిచే మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏటా సంక్రాంతి తర్వాత ఇక్కడ జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఈ ఏడాది జాతర జరగనుంది. కానీ అప్పుడే అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో మేడారం వీధులు జనజాతరను తలపిస్తున్నాయి.

ఆదివారం సెలవురోజు కావడంతో ఈ రోజు హైదరాబాద్ మహానగరంతోపాటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే జాతర ప్రారంభమయ్యాక భక్తుల రద్దీ ఇంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందని, దానికంటే ఇప్పుడు దర్శించుకోవడమే మంచిదన్న ఉద్దేశంతో చాలామంది తరలి వస్తుండడం వల్లే ఈ రద్దీ నెలకొందని స్థానికులు చెబుతున్నారు.

More Telugu News