Tirumala: రాయితీ లడ్డూ విధానానికి నేటితో స్వస్తి పలకనున్న టీటీడీ

  • వివరించిన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి
  • లడ్డూ ప్రసాదంలో అర్ధరాత్రి నుంచి కొత్త విధానం
  • ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తాం
  • అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలి 

రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం స్వస్తి పలకనుంది. లడ్డూ ప్రసాదంలో నేటి అర్ధరాత్రి నుంచి కొత్త విధానం అమలు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని, అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని వివరించారు.

రోజుకు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు కావాల్సిన లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సేవా టిక్కెట్లు, వీఐపీ బ్రేక్, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు కొత్త విధానం అమలు చేస్తున్నట్లు వివరించారు.

More Telugu News