అమరావతి రైతుల భారీ ర్యాలీ : తొలుత మందడం ప్రధాన రహదారిపై నిరసన

19-01-2020 Sun 10:50
  • శివాలయం నుంచి బెజవాడ దుర్గమ్మ సన్నిధికి
  • మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర
  • రాజధానిని కొనసాగించాలని అమ్మవారికి వేడుకోలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గడచిన 33 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులు ఆదివారం భారీ ర్యాలీ ప్రారంభించారు. తొలుత మందడం  ప్రధాన రహదారిపైనే నిరసన తెలియజేశారు. అనంతరం మందడం శివాలయం నుంచి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరకు 13 కిలోమీటర్ల మేరకు ర్యాలీకి సిద్ధమయ్యారు.
 
అమ్మవారికి మొక్కుతీర్చుకునేందుకు బయలుదేరిన వీరు మార్గమధ్యలో స్థానిక మహిళలను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాక రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని వేడుకోనున్నట్లు తెలిపారు.