ఎవరైనా చెప్పండయ్యా.. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని: విజయసాయిరెడ్డి

19-01-2020 Sun 10:41
  • ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు
  • రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారు
  • ఎన్నికల్లో పరమ అవమానకరంగా పరాజయం పాలయ్యారు
  • 6 నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు  

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ, ఇప్పుడు వారు ప్రదర్శిస్తోన్న తీరుని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు.

'ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడు పచ్చ మీడియా అనే ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారు. పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎవరైనా చెప్పండయ్యా. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.