టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు!

19-01-2020 Sun 08:35
  • మున్సిపల్ ఎన్నికలలో మరో ఆసక్తికర సన్నివేశం
  • వికారాబాద్ లో టీడీపీ తరపున టీఆర్ఎస్ నేతల ప్రచారం
  • పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందంటూ మండిపాటు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు... మా తడాఖా చూపిస్తాం కాచుకోండంటూ రెబెల్స్ గా బరిలోకి దిగుతున్నారు. వికారాబాద్ మునిసిపాలిటీలో మరింత ఆసక్తికర ఘటన కొనసాగుతోంది. ఓ టీడీపీ అభ్యర్థి తరపున టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నేత రామయ్యకు కాకుండా మరో అభ్యర్థికి బీఫామ్ ఇచ్చారు. దీంతో, ఆయన వర్గీయులంతా టీడీపీ అభ్యర్థి చొప్పరి యాదయ్యకు మద్దతు పలికారు. ఆయన తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో తమకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు.