కర్రలతో దాడి చేసుకున్న వైసీపీ వర్గీయులు.. ముగ్గురి పరిస్థితి విషమం

19-01-2020 Sun 08:21
  • వైసీపీలో పెరుగుతున్న ఆధిపత్య పోరు
  • అనంతపురం జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • పుట్లూరు మండలం గరుగుచింతలపల్లిలో ఘటన

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అంతర్గత ఆధిపత్య పోరు ఎక్కువవుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లిలో జరిగింది. పెద్దిరెడ్డి, భోగతి నారాయణరెడ్డిల మధ్య జరిగిన ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది. ఇరు వర్గీయులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నేపథ్యంలో గ్రామంలోని పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయేమోనని గ్రామస్తులు భయపడుతున్నారు.