KTR: గాడిదకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పిండితే రావు: కేటీఆర్

  • ఎన్నికల రోజున నేను దేశంలో ఉండను
  • ఆగం కాకుండా టీఆర్ఎస్ కు ఓట్లు వేయండి
  • కుల, మతాల పేరిట రాజకీయాలు మంచిది కాదు

మున్సిపల్ ఎన్నికలు జరిగే రోజున తాను ఇండియాలో ఉండనని.. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తున్నానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చివరి రోజుల్లో ఆగం చేస్తారని... ఎవరూ ఆగం కాకుండా టీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని కోరారు. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే రావని... అధికార పార్టీకి ఓట్లు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

కులాలు, మతాలు పేరిట రాజకీయాలు చేయడం మంచిది కాదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దేశం అబ్బుర పడేలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. బీడు భూములకు గోదావరి జలాలు చేరాయని... కంటి వెలుగు, ఆసరా, ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, రైతుబీమా, రైతుబంధులాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మున్సిపాలిటీలకు ప్రతి నెల రూ. 216 కోట్లు ఇస్తామని... పల్లె ప్రగతి మాదిరే పట్టణ ప్రగతిని చేపడతామని చెప్పారు.

KTR

More Telugu News