బీజేపీ ఎంపీ హత్యకు కుట్ర

19-01-2020 Sun 06:22
  • ఇటీవల ఆరెస్సెస్ కార్యకర్తపై ఎస్డీపీఐ కార్యకర్తల దాడి
  • అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
  •  ఎంపీ తేజస్వి సూర్యను చంపేందుకు కుట్ర పన్నినట్టు తెలిపిన నిందితులు

దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హత్య కోసం జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ వెల్లడించిన వివరాల  మేరకు... ఇటీవల టౌన్ హాల్ వద్ద సీఏఏకు మద్దతుగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఆరెస్సెస్ కార్యకర్తపై ఎస్డీపీఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఎంపీ  తేజస్వితో పాటు యువ బ్రిగేడ్ నేత సూలిబెలెను హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు తెలిసింది. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని, లోతైన విచారణ కోసం వీరిని కస్టడీకి తీసుకుంటామని కమిషనర్ చెప్పారు.