తనకు ఇద్దరు భార్యలున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన

18-01-2020 Sat 22:05
  • దుష్ప్రచారం చేస్తున్నారంటూ వెల్లడి
  • ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నానని ఛలోక్తులు
  • ఎంఐఎం రాష్ట్రమంతా విస్తరిస్తోందని వ్యాఖ్యలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారంలో తలమునకలయ్యారు. అయితే కామారెడ్డిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఉన్న ఒక్క భార్యతోనే పరేషాన్ అవుతుంటే, ఇద్దర్ని చేసుకుని ఎలా వేగుతాను? అంటూ చమత్కరించారు. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని ఒవైసీ కొట్టిపారేశారు. ఇక, ఇతర పార్టీలపైనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని, మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పెళ్లాడితే రిసెప్షన్ మాత్రం శరద్ పవార్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ ను దాటి రాష్ట్రం మొత్తం విస్తరిస్తోందని అన్నారు.