ప్రపంచ క్రియాశీల నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్

18-01-2020 Sat 21:40
  • మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్
  • సిటీ మూమెంటం ఇండెక్స్ విడుదల చేసిన కేటీఆర్
  • ప్రపంచంలోని 130 నగరాలపై అధ్యయనం

వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరును అధిగమించిన భాగ్యనగరం విశిష్ట ఘనత అందుకుంది. 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని ఓ స్థిరాస్తి అధ్యయన సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రపంచంలోని 130 నగరాలపై సదరు స్థిరాస్తి అధ్యయన సంస్థ సర్వే నిర్వహించింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఐదో స్థానంలో చెన్నై, ఏడో స్థానంలో ఢిల్లీ, 12వ స్థానంలో పుణే ఉన్నాయి. కోల్ కతా 16వ స్థానంలో ఉండగా, ముంబయి 20వ స్థానంలో నిలిచింది.