సచివాలయం ఎక్కడ ఉంటుందో అదే రాజధాని: జేసీ

18-01-2020 Sat 20:21
  • జగన్ ది మూర్ఖత్వం అని పేర్కొన్న జేసీ
  • హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉందని వెల్లడి
  • పరిపాలన అమరావతిలోనే సాగాలని ఉద్ఘాటన

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం ఒక వ్యక్తిపై విద్వేషంతోనే జగన్ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రాజేశాడని ఆరోపించారు. గతంలో అదే మూర్ఖత్వం వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడని, ఇప్పుడు కూడా అదే మూర్ఖత్వంతో సీఎంగా పతనంలోకి జారుకుంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు లేవన్నారు. ఏపీ రాజధాని గురించి చెబుతూ, సచివాలయం ఎక్కడ ఉంటుందో అదే రాష్ట్ర రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చని, పరిపాలన మాత్రం అమరావతిలోనే జరగాలని అన్నారు.