Revanth Reddy: కేటీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

  • సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • విచారణకు ఆదేశించకుంటే.. కోర్టుకు వెళతా
  • అవినీతిపై సమగ్ర వివరాలతో ఓ పుస్తకం ప్రచురిస్తా

రాష్ట్ర మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ పై విచారణకు ఆదేశించకుంటే తాను కోర్టుకు వెళతానని పేర్కొన్నారు. 2014లో రూ.8 కోట్లుగా ఉన్న కేటీఆర్ ఆస్తి 2018 నాటికి రూ.41 కోట్లకు ఎలా పెరిగిందని ఎంపీ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విరాళాలు రూ.188 కోట్లకు పెరగటం వెనుక గల రహస్యమేంటని ప్రశ్నించారు.

ఓ పక్క రాష్ట్రం మూడువేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి ఉంటే మీరు మాత్రం వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారంటూ, అవన్నీ ఎలా వచ్చాయంటూ నిలదీశారు. త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. వాటి భోగాలు మీరు అనుభవిస్తున్నారని విమర్శించారు. 111 జీవో పరిధిలో బినామీ పేరుతో కేటీఆర్ రాజమహల్ నిర్మించారన్నారు. పుప్పాల గూడలో రూ.30 కోట్ల ఆస్తిని కోటి రూపాయలకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఈ నేతల అవినీతిపై సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం త్వరలో ప్రచురిస్తానని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News