సీఏఏపై కొత్త పెళ్లికొడుకు వినూత్న ప్రచారం!

18-01-2020 Sat 19:52
  • పౌరసత్వ సవరణ చట్టానికి వినూత్న మద్దతు
  • వివాహానికి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తా
  • సీఏఏపై నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా

ఓ కొత్త పెళ్లి కొడుకు తన పెళ్లి పత్రికపై ‘ఐ సపోర్ట్ సీఏఏ’(సీఏఏకు నేను మద్దతిస్తున్నా) అని ముద్రించి బంధువులకు స్నేహితులకు పంచిపెడుతున్నాడు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..అంతే స్థాయిలో బీజేపీ, దాని మిత్రపక్షాల మద్దతుదార్లు ఈ చట్టానికి మద్దతు తెలుపుతున్నారు.

సాధారణంగా పెళ్లి కార్డులపై శుభ సూచకంగా దేవుడి చిత్రాలు ముద్రిస్తారు. కానీ   మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ కు చెందిన ప్రభాత్ గడ్వాల్ సీఏఏకు మద్దతు తెలపడానికి ఈ వినూత్న పంథాను ఎంచుకున్నాడు. ఈ చట్టంపై తనవంతుగా కొంతమందికైనా అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభాత్ మీడియాతో చెప్పాడు. పెళ్లికి వచ్చిన వారందరికీ.. సీఏఏ గురించి వివరిస్తానని చెబుతున్నాడు.