Ntr: 'అర్ఆర్ఆర్' షూటింగులో జాయిన్ అవుతున్న ఆలియా భట్

  • 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న 'ఆర్ ఆర్ ఆర్'
  • ఈ నెల 20 నుంచి తాజా షెడ్యూల్ 
  • చరణ్ - ఆలియా భట్ పై కీలక సన్నివేశాలు 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ .. చరణ్ జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

చరణ్ - ఆలియా భట్ కాంబినేషన్లోని రొమాంటిక్ సన్నివేశాలను .. పాటలను ఆల్రెడీ చిత్రీకరించినట్టుగా ప్రచారం జరిగింది. ఆలియా భట్ పోర్షన్ షూటింగ్ పూర్తయినట్టుగా చెప్పుకున్నారు. కానీ ఆ వార్తలో ఎంతమాత్రం నిజంలేదని తెలుస్తోంది. చరణ్ - ఆలియా భట్ కాంబినేషన్లో ఇంతవరకూ ఒక్క సన్నివేశాన్ని కూడా చిత్రీకరించలేదనేది తాజా సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి మొదలయ్యే తాజా షెడ్యూల్లోనే ఆలియా భట్ జాయిన్ కానుందని అంటున్నారు. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్లో చరణ్ - ఆలియా భట్, ఎన్టీఆర్ - సముద్రఖని కాంబినేషన్లోని సీన్స్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

More Telugu News