Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిపై తీహార్ మాజీ జైలర్ వ్యాఖ్యలు

  • ఉరి సరికాదన్న తీహార్ మాజీ జైలర్ సునీల్ గుప్తా
  • నేరస్తులు జాగ్రత్తపడి ఆధారాలు మాయం చేస్తారని వెల్లడి
  • ఉరి వల్ల నేరాలు తగ్గవని వ్యాఖ్యలు

దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ఇన్నాళ్లకు నిర్భయ దోషులకు ఉరి అమలు చేసే క్షణాలు వచ్చాయి. అయితే, నిర్భయ దోషులను ఉరితీయడం సరికాదని తీహార్ మాజీ జైలర్ సునీల్ గుప్తా అంటున్నారు.

ఉరిశిక్ష వేసేంత తీవ్రత ఉన్న కేసుల్లో నేరస్తులు ముందే జాగ్రత్త పడతారని, కీలక ఆధారాలను మాయం చేస్తారని, అది ఇంకా ప్రమాదమని గుప్తా అభిప్రాయపడ్డారు. పైగా, నేరస్తులను ఉరితీయడం వల్ల నేరాలు తగ్గుతాయా అంటే దానిపై స్పష్టత లేదని తెలిపారు. సునీల్ గుప్తా తీహార్ జైలర్ గా ఎక్కువకాలం  పాటు విధులు నిర్వర్తించారు. విధి నిర్వహణలో భాగంగా, ఆయన పార్లమెంటుపై దాడికి సూత్రధారి అఫ్జల్ గురు సహా ఎనిమిది మందికి ఉరి అమలు చేశారు.

More Telugu News