Pawan Kalyan: పవన్ పనితీరుపై ఆ పార్టీ నేతలే జుట్టు పీక్కుంటున్నారు: అవంతి

  • బీజేపీతో చేయి కలిపిన జనసేన
  • స్పందించిన మంత్రి అవంతి
  • పవన్ ది అవకాశవాద రాజకీయం అంటూ వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో చేయి కలపడం అవకాశవాద రాజకీయం అని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పవన్ తీరుపై ఆ పార్టీ నేతలే జుట్టు పీక్కుంటున్నారని విమర్శించారు. పవన్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎవరిని తిడతాడో, ఎవరిని పొగుడుతాడో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మొదట టీడీపీ ఎంపీలను ఓ ప్రణాళిక ప్రకారం బీజేపీలోకి పంపారని, ఇప్పుడు జనసేనను కూడా అదే ప్రణాళికతో పంపించారని అవంతి ఆరోపించారు.

More Telugu News