Prabhas: 'జాన్' సినిమా నుంచి ఓ స్టిల్ వదిలిన ప్రభాస్

  • షూటింగు దశలో 'జాన్'
  • ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే 
  •  పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ

ప్రస్తుతం ప్రభాస్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఒక అప్ డేట్ వదిలాడు.

ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ ను ఆయన రిలీజ్ చేశాడు. విలాసవంతమైన ఒక భవనంలోకి అడుగుపెట్టిన ఆయన, అక్కడి పరిసరాలను చూస్తూ ఏదో గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. పునర్జన్మలతో ముడిపడిన ఈ కథ .. యూరప్ నేపథ్యంలో రూపొందుతోంది.

More Telugu News