mumbai: పెరోల్‌పై బయటికొచ్చి అదృశ్యమైన ముంబై పేలుళ్ల దోషి 'డాక్టర్ బాంబ్'

  • 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ
  • 'డాక్టర్ బాంబ్'గా పేరు
  • పెరోల్ గడువు ముగుస్తుండడంతో పరారీ?

'డాక్టర్ బాంబ్'గా పేరు పొందిన 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ కనపడకుండా పోయాడు. 'డాక్టర్ బాంబ్' రాజస్థాన్‌లోని అజ్మీర్‌ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే, అతడు 21 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చాడు. ప్రతి రోజు అతడు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అగ్రిపడా పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉంది.

నిన్న, ఈ రోజు జలీస్‌ అన్సారీ పోలీస్ స్టేషన్‌కు రాలేదు. అతడి కొడుకు జైద్‌ అన్సారీ తన తండ్రి జలీస్‌ అన్సారీ కనపడట్లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు జలీస్‌ అన్సారీ కోసం గాలింపు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలలో గతంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసుల్లోనూ ఆయన పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. పెరోల్ గడువు ముగుస్తుండడంతోనే ఆయన కనపడకుండా పోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News