West Godavari District: ఆ గ్రామంలో సంక్రాంతికి పందుల పోటీ.. ఉత్సాహంగా పాల్గొనే వరాహాలు!

  • తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో పోటీలు 
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోటీదారులు 
  • తరాలుగా కొనసాగుతున్న ఆచారం

సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు, గొర్రెపందాలు జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా ఉభయగోదావరి, క్రష్ణా జిల్లాల్లో భారీగా పందాలు జరుగుతుంటాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలోని ఓ సామాజిక వర్గం వారు పండుగ రోజు పందుల పోటీలు నిర్వహించి, తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. 

తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని వీరు క్రమం తప్పకుండా ఆచరించి సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోటీదారులు తమ పందులతో హాజరు కావడం విశేషం. ఎటువంటి జీవహింస లేకుండా ఆరోగ్యకరమైన విధానంలో ఈ పోటీ జరుగుతుందని, తోకముడిచి పారిపోయిన పంది ఓడిపోయినట్టు భావించి మిగిలిన దాన్ని విజేతగా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం మరో విశేషం.

More Telugu News