Pavan Kalyan: పవన్ సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ ఖరారు

  • తెలుగులోకి 'పింక్' రీమేక్ 
  • ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • మే 23వ తేదీన సినిమా రిలీజ్

హిందీలో 'పింక్' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టేసింది. దాంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న 'దిల్' రాజు, పవన్ ను ఒప్పించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి అంగీకరించిన పవన్, ఈ నెల 20వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసేశారు. వేసవి కానుకగా మే 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ముఖ్యమైన పాత్రలకి గాను ఇప్పటికే అంజలి .. నివేద థామస్ .. అనన్యలను ఎంపిక చేసుకున్నారు. కథానాయికగా పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి పవన్ ఇక వరుస సినిమాలు చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More Telugu News