Kangana: 'తలైవి' నుంచి ఎంజీఆర్ గా అరవింద్ స్వామి ఫస్టులుక్

  • షూటింగు దశలో 'తలైవి'
  • జయలలిత పాత్రలో కంగన 
  •  దర్శకుడిగా ఏఎల్ విజయ్     

అందాల కథానాయికగా .. రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా జయలలిత జీవితంలో అనేకమైన అనూహ్యమైన మలుపులు వున్నాయి. అలాంటి జయలలిత బయోపిక్ ను దర్శకుడు ఏఎల్ విజయ్ 'తలైవి' టైటిల్ తో రూపొందిస్తున్నాడు. విష్ణువర్ధన్ .. శైలేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కంగన నటిస్తోంది. శిక్షణ తీసుకుని మరీ కంగన ఈ పాత్రను పోషిస్తోంది.

సినిమాల పరంగాను .. రాజకీయాల పరంగాను ఎంజీఆర్ తో కలిసి జయలలిత ఎక్కువ దూరం ప్రయాణం చేశారు. అందువలన ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర కూడా కీలకమే. ఈ కారణంగానే ఈ పాత్రకి అరవింద్ స్వామిని తీసుకున్నారు. ఈ రోజున ఎంజీఆర్ జయంతి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఎంజీఆర్ గా అరవిందస్వామి ఫస్టు లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో ఎంజీఆర్ ను తలపిస్తూ అరవింద్ స్వామి ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు.

More Telugu News