నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన 'అల వైకుంఠపురములో..'!

17-01-2020 Fri 10:29
  • గత వారం విడుదలైన కొత్త చిత్రాలు
  • కొన్ని చోట్ల బన్నీ, మరికొన్ని చోట్ల మహేశ్ సినిమాల జోరు 
  • విదేశాల్లో పోటాపోటీగా సాగుతున్న రెండు సినిమాలు

గత వారంలో విడుదలైన అల్లు అర్జున్ కొత్త చిత్రం 'అల వైకుంఠపురములో..' నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టి, కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ కావడం, చిత్ర కథాంశం ప్రేక్షకులకు నచ్చడంతో పాటు బన్నీ డ్యాన్సులు, యాక్షన్ సీన్స్ కు ఫిదా అయిపోవడంతో, విడుదలైన అన్ని చోట్లా సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

నైజాంతో పాటు కృష్ణా, సీడెడ్, వైజాగ్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో ఈ సినిమా బాహుబలి తరువాత అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. మిగతా ప్రాంతాల్లో మహేశ్ బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్లలో ముందున్నట్టు తెలుస్తోంది. ఇక విదేశాల్లో ఈ రెండు చిత్రాలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.