Corona Virus: చైనాను వణికిస్తున్న కొత్త వైరస్

  • పెను ముప్పుగా మారనున్న కరోనా వైరస్
  • వైరస్ బారిన పడిన వుహాన్ నగరం
  • తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్ఓ

స్వైన్ ఫ్లూ, జికా వంటి వైరస్ లు ప్రపంచాన్ని వణికించడాన్ని మనం ఇప్పటికే చూశాం. తాజాగా సరికొత్త వైరస్ కరోనా ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా పరిణమించబోతోంది. ఇప్పటికే చైనాలోని వుహాన్ నగరాన్ని ఈ వైరస్ వణికిస్తోంది.

దీని బారిన పడినవారు తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతున్నారు. 40 మంది ఈ వైరస్ బారిన పడగా... వారిలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నగరాన్ని చూడ్డానికి వచ్చిన ఓ జపాన్ పౌరుడికి కూడా వైరస్ సోకింది. వారం క్రితం థాయ్ లాండ్ కు చెందిన ఓ యువతి ఈ వైరస్ బారిన పడింది.

ఈ నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వైరస్ జంతువుల నుంచి వస్తోందని తొలుత భావించినప్పటికీ... మనుషుల నుంచే వస్తోందని ఆ తర్వాత గుర్తించారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.

More Telugu News